ప్రజాస్వామ్య హక్కును ఉత్సాహంగా వినియోగించుకోండి: ఈసీ

ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును ఉత్సాహంగా వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. మంగళవారం జరగబోయే 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన ఎన్నికల

Published : 25 Jan 2022 04:35 IST

దిల్లీ: ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును ఉత్సాహంగా వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. మంగళవారం జరగబోయే 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌చంద్ర ఈ మేరకు ఓటర్లకు సందేశమిచ్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కనిపించే ఓటర్ల తాకిడి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. కరోనా సమస్య వచ్చిన తర్వాత గత రెండేళ్లలో ఎన్నికల నిర్వహణ ఎంతో సవాలుగా మారిందన్నారు. ‘ఓటును, ఓటర్లను పరిరక్షించేలా ఈసీ అన్ని చర్యలు తీసుకుంది’ అని చెప్పారు.

వీడియో వ్యాన్ల ప్రచారానికి షరతులు వర్తిస్తాయి  

ఎన్నికల రాష్ట్రాల్లో వీడియో వ్యాన్ల ద్వారా పార్టీలు ప్రచారం చేసుకునేందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం.. దానికి కొన్ని షరతులు విధించింది. ఏ ప్రదేశంలోనూ అరగంటకు మించి ఆ వ్యాన్లు ఆగకూడదని, 500 మందికి మించి ఒకేచోట చేరకూడదని స్పష్టంచేసింది. ట్రాఫిక్‌కు ఎక్కడా అవి అడ్డుపడకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించింది. ఫలానా అభ్యర్థికి ఓటు వేయండని అడగడానికి కాకుండా పార్టీకి ప్రజల మద్దతు కోరడానికి వ్యాన్లను ఉపయోగించుకోవాలి. లేదంటే ఖర్చును సంబంధిత అభ్యర్థి ఖాతాలో వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని