Golden Book Of World Records: గొలుసులు బిగించుకుని సముద్రంలో సాహసయాత్ర

సంకల్పం ఉండాలేగాని వయసు అడ్డురాదని నిరూపించారు కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కిదియూరుకు చెందిన 66 ఏళ్ల గంగాధర కడేకర్‌. చేతులు, కాళ్లకు గొలుసులు బిగించుకుని అరేబియా

Published : 25 Jan 2022 09:13 IST

ఉడుపి, న్యూస్‌టుడే: సంకల్పం ఉండాలేగాని వయసు అడ్డురాదని నిరూపించారు కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కిదియూరుకు చెందిన 66 ఏళ్ల గంగాధర కడేకర్‌. చేతులు, కాళ్లకు గొలుసులు బిగించుకుని అరేబియా సముద్రంలో మూడున్నర కిలోమీటర్ల దూరాన్ని ఈది ఔరా! అనిపించారు. గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. సోమవారం ఆయన కిదియూరు వద్ద అరేబియా సముద్రంలో ఉదయం 7.50 గంటలకు ఈదడాన్ని ఆరంభించారు. ఏకధాటిగా 5.35 గంటలపాటు ఈది మూడున్నర కిలోమీటర్ల దూరం చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని