నిర్మాణ వ్యర్థాలతో ఫర్నీచర్‌ ముద్రణ

నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాలతో ఫర్నీచర్‌ను రూపొందించడానికి గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక త్రీడీ ప్రింటర్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఫర్నీచర్‌ కోసం పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన ప్రింటబుల్‌ కాంక్రీట్‌ను పరిశోధకులు

Published : 25 Jan 2022 04:39 IST

సరికొత్త త్రీడీ ప్రింటర్‌ను రూపొందించిన భారత పరిశోధకులు

ఈనాడు, గువాహటి: నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాలతో ఫర్నీచర్‌ను రూపొందించడానికి గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక త్రీడీ ప్రింటర్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఫర్నీచర్‌ కోసం పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన ప్రింటబుల్‌ కాంక్రీట్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సాయంతో 0.4 మీటర్ల ఎత్తు, 0.4 మీటర్ల వెడల్పు కలిగిన వంపైన కుర్చీని నిర్మించారు. ప్రింటర్‌ సాయంతో పొరలు పొరలుగా ముద్రిస్తూ దీన్ని సిద్ధం చేశారు.  సాధారణంగా ఇలాంటి వాటిని అచ్చులు సాయంతో తయారుచేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో పోల్చితే త్రీడీ ముద్రణ వల్ల 75 శాతం తక్కువ కాంక్రీటు అవసరమవుతుంది. నిర్మాణ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ఈ సాంకేతికత అద్భుత పరిష్కారమవుతుందని ఐఐటీ గువాహటి డైరెక్టర్‌ టి.జి.సీతారామ్‌ తెలిపారు. ధ్రుతిమాన్‌ డే, దొడ్డ శ్రీనివాస్‌, భవేష్‌ చౌదరిలు ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని