Published : 25 Jan 2022 04:42 IST

‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’కూ మద్దతివ్వండి

స్థానిక ఉత్పత్తులు కొనేలా చూడండి
రాష్ట్రీయ బాల పురస్కార విజేతలతో ప్రధాని

దిల్లీ: తల్లిదండ్రులతో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయించాలని దేశంలోని చిన్నారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ‘రాష్ట్రీయ బాల పురస్కార్‌’ నెగ్గిన చిన్నారులకు బ్లాక్‌చైన్‌ సాంకేతికత ద్వారా ధ్రువపత్రాలను అందజేశారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలను ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో దేశంలోని చిన్నారులు పోషించిన పాత్రను ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులకు ఊతమిచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రారంభించిన ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ కార్యక్రమానికీ.. చిన్నారులు మద్దతు అందించాలని కోరారు. ఇంట్లో తాము వాడుతున్న విదేశీ వస్తువుల జాబితాను తయారు చేయాలని.. భవిష్యత్తులో దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేసేలా పెద్దవారిని ఒప్పించాలని సూచించారు. ఈ ఏడాది ‘రాష్ట్రీయ బాల పురస్కార్‌’కు 29 మంది చిన్నారులు ఎంపికయ్యారు. ఇందులో 14 మంది బాలికలు. వీరికి ధ్రువపత్రంతో పాటు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందజేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని