ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలి

ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలని 86% మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు తాజా సర్వే వెల్లడించింది. సామాజిక వేదిక ‘పబ్లిక్‌ యాప్‌’ దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో సుమారు 4 లక్షల మంది తమ

Published : 26 Jan 2022 05:02 IST

‘పబ్లిక్‌ యాప్‌’ సర్వేలో 86% మంది అభిప్రాయం

దిల్లీ: ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలని 86% మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు తాజా సర్వే వెల్లడించింది. సామాజిక వేదిక ‘పబ్లిక్‌ యాప్‌’ దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో సుమారు 4 లక్షల మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సదరు సంస్థ ఈ వివరాలను మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు పారదర్శకంగానే ఉందని సుమారు 81% మంది విశ్వాసం వ్యక్తం చేసినట్టు తెలిపింది. ‘‘అభ్యర్థి గతంలో కనబరచిన పనితీరును పరిగణనలోకి తీసుకుంటామని 34% మంది, అభ్యర్థులందరి గురించి వివరంగా తెలుసుకున్నాకే ఓటు వేస్తామని 31% మంది వెల్లడించారు. పేరున్న అభ్యర్థిని ఎన్నుకుంటామని 4.96%, పార్టీని బట్టి అభ్యర్థికి ఓటు వేస్తామని 11.92% మంది చెప్పారు. మరో ప్రాంతంలో ఉండటం వల్లే పోలింగ్‌కు దూరమవుతున్నామని 30.04% మంది, తాము ఎప్పుడూ ఓటు వేయకుండా ఉండలేదని 56.3% మంది చెప్పారు. ఎన్నికల గురించి తమకు తెలియదని 5.22%, ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోమని 7.19%, ఎన్నికలను తాము అసలు పట్టించుకోబోమని 1.27% మంది చెప్పారు’’ అని సర్వే సంస్థ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని