గణతంత్ర దిన వేడుకల్లో 75 విమానాల విన్యాసాలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకల్లో భాగంగా బుధవారం గణతంత్ర దిన సంబరాలు దేశమంతా ఘనంగా నిర్వహించనున్నట్లు రక్షణ

Published : 26 Jan 2022 05:02 IST

దిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకల్లో భాగంగా బుధవారం గణతంత్ర దిన సంబరాలు దేశమంతా ఘనంగా నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. దిల్లీ కవాతులో మొదటిసారిగా భారత వాయుసేనకు చెందిన 75 విమానాల విన్యాసాలు, దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు, అటూ ఇటూ అయిదేసి చొప్పున పది భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో పాత విమానాలతోపాటు ఆధునిక ఎయిర్‌క్రాఫ్ట్‌లు రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వార్‌ వంటివి ప్రదర్శిస్తారు. రక్షణ, సాంస్కృతిక మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో 600 మంది ప్రముఖ చిత్రకారులు రూపొందించిన చిత్రాల ప్రదర్శన ఉంటుంది. గత గణతంత్ర వేడుకల విశేషాలు, సాయుధ దళాలపై చిత్రీకరించిన లఘు చిత్రాలు కవాతకు ముందు ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని