ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేడ్కర్‌, భగత్‌సింగ్‌ల చిత్రపటాలు

గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌, విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు

Published : 26 Jan 2022 05:02 IST

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటన

దిల్లీ: గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌, విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ల చిత్ర పటాలను మాత్రమే ఉంచుతామని ప్రకటించారు. కార్యాలయాల్లో ఏ ఒక్క రాజకీయ నేత ఫొటోకు స్థానం కల్పించబోమని. చివరకు ముఖ్యమంత్రి చిత్రపటానికి కూడా స్థానం ఉండదని స్పష్టంచేశారు. అంబేడ్కర్‌, భగత్‌సింగ్‌ల జీవితాల నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని మంగళవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరిద్దరి సిద్ధాంతాల ఆధారంగానే దిల్లీ సర్కారు పనిచేస్తుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని