‘పద్మ’ పురస్కారం మాకొద్దు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను తిరస్కరించిన వారి సంఖ్య మూడుకు చేరింది. పద్మ భూషణ్‌ అవార్డును మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య, పద్మశ్రీ అవార్డును ప్రముఖ గాయని సంధ్య ముఖర్జీ(90) నిరాకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Published : 27 Jan 2022 04:31 IST

బుద్ధదేవ్‌ బాటలో మరో ఇద్దరు

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను తిరస్కరించిన వారి సంఖ్య మూడుకు చేరింది. పద్మ భూషణ్‌ అవార్డును మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య, పద్మశ్రీ అవార్డును ప్రముఖ గాయని సంధ్య ముఖర్జీ(90) నిరాకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ప్రముఖ తబలా వాద్యకారుడు పండిట్‌ అనింద్య ఛటర్జీ(67) కూడా తనకు పద్మశ్రీ పురస్కారం వద్దని తెలిపారు. వీరందరూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికే చెందిన వారు కావడం గమనార్హం. తనకు పద్మశ్రీ వచ్చినట్లు మంగళవారమే దిల్లీ నుంచి ఫోన్‌ వచ్చిందని చెప్పిన అనింద్య.. కెరీర్‌ ప్రస్తుత దశలో పద్మశ్రీ అందుకోవడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు. పదేళ్ల క్రితమే తన జూనియర్లకు ఈ పురస్కారం వచ్చిందని, అప్పుడే తనకూ ఇచ్చి ఉంటే ఆనందంగా స్వీకరించేవాడినని అనింద్య పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని