ప్రముఖ బెంగాల్‌ గాయని సంధ్యా ముఖర్జీకి కొవిడ్‌

పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ కొవిడ్‌ బారిన పడ్డారు. 90 ఏళ్లకు పైబడిన ఆమెకు గురువారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ప్రభుత్వ ఆసుపత్రికి ‘గ్రీన్‌ కారిడార్‌’ మార్గంలో తరలించారు.

Published : 28 Jan 2022 04:27 IST

ఆసుపత్రికి తరలింపు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ కొవిడ్‌ బారిన పడ్డారు. 90 ఏళ్లకు పైబడిన ఆమెకు గురువారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ప్రభుత్వ ఆసుపత్రికి ‘గ్రీన్‌ కారిడార్‌’ మార్గంలో తరలించారు. అనంతరం ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఎన్నో బెంగాలీ, హిందీ చిత్రాల్లో పాటలు పాడిన సంధ్యా ముఖర్జీ ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆమె బుధవారం సాయంత్రం బాత్‌రూమ్‌లో పడిపోయారని, అప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితి క్రమేపీ ఇబ్బందికరంగా మారినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి సంధ్యా ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని