
రైల్వేట్రాక్, మొబైల్ టవర్ పేల్చిన మావోలు
గిరిడీహ్/ధన్‌బాద్/లాతేహార్: ఝార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలో రెండు వేర్వేరు దాడుల్లో అనుమానిత మావోయిస్టులు రైల్వేట్రాకు పేల్చివేసే ప్రయత్నం చేశారు. ఫిష్‌ప్లేట్లు దెబ్బతిన్నాయి. ఇదేవిధంగా హజారీబాగ్‌లో మొబైల్ టవర్ పేల్చివేశారు. మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా అరెస్టుకు నిరసనగా ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో 24 గంటల బందుకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. అరెస్టుకు ముందు.. కిషన్ దా తలపై ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.