సూపర్‌ మార్కెట్లలో మద్యం అమ్మకాలు

మద్యం ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్‌ మార్కెట్లు, వాక్‌ ఇన్‌ (నేరుగా వెళ్లి కొనుగోలు చేసే) దుకాణాల్లోనూ మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ.. ‘షెల్ఫ్‌ ఇన్‌ షాప్‌’ విధానానికి రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది.

Published : 28 Jan 2022 04:23 IST

మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ముంబయి: మద్యం ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్‌ మార్కెట్లు, వాక్‌ ఇన్‌ (నేరుగా వెళ్లి కొనుగోలు చేసే) దుకాణాల్లోనూ మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ.. ‘షెల్ఫ్‌ ఇన్‌ షాప్‌’ విధానానికి రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. మద్యం అమ్మే వాక్‌ ఇన్‌ దుకాణాలకు 1000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉండాలన్న షరతు విధించింది. వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లకు మంచి ధరలు లభించాలనే ఉద్దేశంతోనే మద్యం పాలసీని మార్చినట్టు మంత్రి నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. పండ్ల ద్వారా తయారుచేసిన వైన్‌ విక్రయాలు పెరగటం ద్వారా రైతులకు గరిష్ఠ ధరలు లభిస్తాయన్నారు. మంత్రివర్గం నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ తప్పుబట్టారు. మహారాష్ట్రను.. మద్యం రాష్ట్రంగా మారుస్తున్నారని విమర్శించారు. అయితే భాజపాకు మద్యం అమ్మకాలపై మాట్లాడే హక్కు లేదన్నారు మాలిక్‌. హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి విధానాలే ఉన్నాయని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని