
ఫిబ్రవరి 28 వరకు కొవిడ్ నిబంధనల పొడిగింపు
ఈనాడు, దిల్లీ: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కొవిడ్ నిబంధనలను ఫిబ్రవరి 28వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు ‘విపత్తు నిర్వహణ చట్టం-2005’ కింద నిబంధనలను పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. క్రియాశీలక కేసులు 22 లక్షలు దాటాయి. కరోనా వైరస్ వ్యాప్తి సరళిని దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్తగా నిబంధనలను పొడిగిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.