14న పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఫిబ్రవరి 14న పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి52 ప్రయోగం చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక

Published : 28 Jan 2022 04:23 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఫిబ్రవరి 14న పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి52 ప్రయోగం చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక అనుసంధానం చురుగ్గా జరుగుతోంది. దీని ద్వారా ఆర్‌ఐశాట్‌-1ఎ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పీఎస్‌ఎల్‌వీ-సి53 ద్వారా ఓషెన్‌శాట్‌-3, పీఎస్‌ఎల్‌వీ-సి54 వాహకనౌక నుంచి ఐఎన్‌ఎస్‌-2బి, ఆనంద్‌, ఏప్రిల్‌లో చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి1) ప్రయోగం చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని