ఎడ్లబండి గ్రంథాలయం.. పిల్లల ఇంటికే పాఠం!

కరోనాతో పాఠశాలలు మూతపడి చదువుకు దూరమైన విద్యార్థుల కోసం మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌ జిల్లా ఉపాధ్యాయురాలు కమలా దవండే ఓ వినూత్న ఆలోచన చేశారు. ఆన్‌లైను తరగతులకు హాజరయ్యేందుకు ఇబ్బందిపడుతున్న

Published : 29 Jan 2022 04:11 IST

కరోనాతో పాఠశాలలు మూతపడి చదువుకు దూరమైన విద్యార్థుల కోసం మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌ జిల్లా ఉపాధ్యాయురాలు కమలా దవండే ఓ వినూత్న ఆలోచన చేశారు. ఆన్‌లైను తరగతులకు హాజరయ్యేందుకు ఇబ్బందిపడుతున్న పిల్లలకూ ఉపయోగపడేలా.. ఎద్దులబండి లైబ్రరీకి శ్రీకారం చుట్టారు. తనే ఇంటింటికీ వెళ్లి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు ఇళ్ల వద్దే మొహల్లా పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. సరైన సాంకేతిక సదుపాయాల్లేని భౌంసదేహీ ప్రాంత మారుమూల గ్రామానికి చెందిన పిల్లల కోసం ఏదైనా చేయాలన్న కమల సంకల్పం ఇలా సాకారమైంది. ఇంటి ముందుకు లైబ్రరీ వచ్చిందని తెలిపేలా.. బండి వెనకాల వెళ్లే కొందరు విద్యార్థులు ప్లేటుపై కర్రతో కొడతారు. విద్యార్థులు బండి వద్దకు వచ్చి.. కావాల్సిన పుస్తకాలు తీసుకుంటారు. ‘మా పాఠశాలలో 87 మంది పిల్లలు, ముగ్గురు ఉపాధ్యాయులం ఉన్నాం. ఉపాధ్యాయుల్లో ఒకరిని సూపరింటెండెంటుగా నియమించారు. మరొకరు కొవిడ్‌ సెలవులో ఉన్నారు. ఇక నేనే మిగిలాను. పిల్లలందరికీ పుస్తకాలు పంచాలని ఎద్దులబండిని లైబ్రరీగా మార్చాను’ అని తన ప్రయత్నం గురించి వివరించారు కమలా దవండే. పిల్లల చదువు ఆగకూడదనే తాపత్రయంతో కమల చేస్తున్న పనిని నెటిజన్లు సహా.. స్థానిక అధికారులు ప్రశంసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని