
హైదరాబాద్‌లో ఒపో ఇండియా పవర్ ల్యాబ్
దిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ఒపో ఇండియా భారత్‌లో ఒక పవర్, పర్ఫామెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో కంపెనీకి ఉన్న పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రంలో మార్చికల్లా ఇది ఏర్పాటవుతుంది.ఈ ల్యాబ్ కంపెనీకి మూడోది అవుతుంది. భవిష్యత్తులో విడుదల చేసే స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరచడంపై ఈ ల్యాబ్ దృష్టి సారిస్తుందని కంపెనీ హెడ్ (పరిశోధన-అభివృద్ధి), వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ ఆరిఫ్ తెలిపారు. ‘గతేడాది 5జీ, కెమెరాలను ఆవిష్కరించాం. ఈ ఏడాది పవర్, పర్ఫామెన్స్‌కు ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాం. వినియోగదార్లు థర్డ్ పార్టీ యాప్‌లను భారీగా డౌన్లోడ్ చేసుకుంటుండడంతో ఫోన్ పనితీరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు మేం ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా బ్యాటరీ శక్తి, పనితీరును మెరుగుపరుస్తామ’ని వివరించారు. ‘5జీ పరీక్షల కోసం టెలికాం ఆపరేటర్లతో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. 5జీ సేవలకు మద్దతు కోసం పవర్ బ్యాకప్‌ను మెరుగుపరుచుకోవడంపైనా పనిచేస్తున్నామ’నితెలిపారు. ఫిబ్రవరిలో రాబోయే రెనో7లో ‘ఇండియా ల్యాబ్’ నుంచి సృష్టించిన వినూత్నత కనిపిస్తుందని ఆరిఫ్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.