ISRO: ఈ ఏడాది ఇస్రో నుంచి 19 రాకెట్‌ ప్రయోగాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ ఏడాది 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు, 4 టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్‌-3 కూడా ఉంది. ఈ

Updated : 04 Feb 2022 07:00 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ ఏడాది 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు, 4 టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్‌-3 కూడా ఉంది. ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగం (పీఎస్‌ఎల్‌వీ-సి52) ఫిబ్రవరి 14న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టనుంది. ఇది భూ పరిశీలన ఉపగ్రహం (ఆర్‌ఐశాట్‌-1ఎ)తోపాటు ఐఎన్‌ఎస్‌-2డి ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. చంద్రయాన్‌-3 ప్రయోగం ఆగస్టులో చేపట్టేలా ప్రణాళికలు రచించారు. దీనిని గతేడాదే చేపట్టాలని నిర్ణయించినా కొవిడ్‌ వల్ల వాయిదా వేశారు. 2020, 2021లో కరోనా మహమ్మారి వల్ల ఇస్రో రాకెట్‌ ప్రయోగాలు సక్రమంగా చేపట్టలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని