నీట్‌ మినహాయింపు బిల్లు వెనక్కి

నీట్‌ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్‌ రవి వెనక్కి పంపారు. దీనిపై ప్రభుత్వం, తమిళ రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నీట్‌ రద్దు చేయాలని  ప్రస్తుత డీఎంకే

Published : 04 Feb 2022 05:18 IST

గవర్నర్‌ తీరుపై తమిళనాడు ప్రభుత్వం అసంతృప్తి

చెన్నై, న్యూస్‌టుడే: నీట్‌ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్‌ రవి వెనక్కి పంపారు. దీనిపై ప్రభుత్వం, తమిళ రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నీట్‌ రద్దు చేయాలని  ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం, విపక్ష అన్నాడీఎంకే పోరాడుతున్నాయి. నీట్‌ రద్దు, వైద్య విద్యార్థులపై ప్రభావం గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకే ప్రభుత్వం.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే రాజన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా నీట్‌ నుంచి మినహాయింపు కల్పించాలని, సెప్టెంబరు 13న రాష్ట్ర శాసనసభలో బిల్లు ఆమోదించారు. ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. ఈ నేపథ్యంలో బిల్లుకు సంబంధించి గురువారం రాజ్‌భవన్‌ వివరణ ఇచ్చింది. నీట్‌ పరీక్షకు ముందు, ఆ తర్వాత వైద్యవిద్యలో ప్రవేశాలు పొందిన ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే వారి ప్రయోజనాలకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. శాసనసభ పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి పంపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని