Covaxin: కొవాగ్జిన్‌ ద్వారా ఐసీఎంఆర్‌కు రూ.171 కోట్ల రాయల్టీ

కొవాగ్జిన్‌ టీకా విక్రయం ద్వారా భారత్‌ బయోటెక్‌ సంస్థ నుంచి ఐసీఎంఆర్‌కు రాయల్టీ రూపంలో రూ.171.74 కోట్లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. మంగళవారం

Updated : 09 Feb 2022 09:24 IST

ఈనాడు, దిల్లీ: కొవాగ్జిన్‌ టీకా విక్రయం ద్వారా భారత్‌ బయోటెక్‌ సంస్థ నుంచి ఐసీఎంఆర్‌కు రాయల్టీ రూపంలో రూ.171.74 కోట్లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. కొవాగ్జిన్‌ పరిశోధన, అభివృద్ధి కోసం ఐసీఎంఆర్‌ రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఐసీఎంఆర్‌ వద్ద ఉన్న నిధులను పరిశోధన కార్యకలాపాల కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని