PF interest rate: పీఎఫ్‌ వడ్డీరేటుపై మార్చిలో నిర్ణయం

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు చెందిన అత్యున్నత నిర్ణాయక మండలి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) మార్చి నెల్లో సమావేశమై 2021-22కు సంబంధించి ఉద్యోగుల భవిష్యనిధి డిపాజిట్ల వడ్డీ రేటు విషయమై ఓ నిర్ణయం తీసుకోనుంది.

Updated : 14 Feb 2022 08:57 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు చెందిన అత్యున్నత నిర్ణాయక మండలి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) మార్చి నెల్లో సమావేశమై 2021-22కు సంబంధించి ఉద్యోగుల భవిష్యనిధి డిపాజిట్ల వడ్డీ రేటు విషయమై ఓ నిర్ణయం తీసుకోనుంది. ‘‘ఈపీఎఫ్‌వో సీబీటీ  సమావేశం అస్సాంలోని గువాహటిలో  మార్చి నెల్లో జరగనుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నందున 2021-22కు సంబంధించి వడ్డీ రేటు ప్రతిపాదనను చర్చించాల్సిన అంశాల జాబితాలో చేర్చాం’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్‌ వడ్డీ రేటుపై మంత్రిని ప్రశ్నించగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2020-21 ఏడాదికి ఇచ్చినట్లుగానే 2021-22లో కూడా 8.5 శాతం వడ్డీ రేటు ఉంటుందా అని ప్రశ్నించగా.. ఆదాయ అంచనాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని