Donation: ఐఐఎస్‌సీలో పీజీ మెడికల్‌ స్కూల్‌కు రూ.450 కోట్ల భారీ విరాళం

భారతీయ విజ్ఞాన సంస్థ(ఐఐఎస్‌సీ) బెంగళూరులో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ స్కూల్‌, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌, వైద్య సేవలను ఒకే ఆవరణలో అందించనుంది. కొత్తతరం ఫిజీషియన్‌ సైంటిస్ట్‌లను తయారు

Updated : 15 Feb 2022 07:45 IST

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: భారతీయ విజ్ఞాన సంస్థ(ఐఐఎస్‌సీ) బెంగళూరులో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ స్కూల్‌, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌, వైద్య సేవలను ఒకే ఆవరణలో అందించనుంది. కొత్తతరం ఫిజీషియన్‌ సైంటిస్ట్‌లను తయారు చేసే ఎండీ- పీహెచ్‌డీ ప్రోగ్రాంలను ఈ మెడికల్‌ స్కూల్‌ ద్వారా నిర్వహించనున్నట్లు ఐఐఎస్‌సీ డైరెక్టర్‌ ఆచార్య గోవిందన్‌ రంగరాజన్‌ సోమవారం ప్రకటించారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుకు దాతలు సుబ్రొతో బాగ్చి, పార్థసారథిలు రూ.450 కోట్ల భారీ విరాళాలిచ్చినట్లు తెలిపారు. బాగ్చి-పార్థసారథి హాస్పిటల్‌ పేరిట స్థాపించే నిర్మాణాన్ని జూన్‌లో ప్రారంభించి 2024 నాటికి పూర్తి చేస్తామన్నారు. 800 పడకలతో నిర్మించే ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు, క్లినికల్‌ సైన్సెస్‌, బేసిక్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ టెక్నాలజీ సైన్స్‌ పరిశోధనలు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని