
Tea: అస్సాం తేయాకుకు రికార్డు ధర.. కిలో ఎంతంటే?
ఈనాడు, గువాహటి: అస్సాం తేయాకుకు మళ్లీ ఆకర్షణీయమైన ధర లభించింది. ఈ మేరకు గువాహటి టీ వేలం కేంద్రంలో సోమవారం కిలో తేయాకు ధర రూ.99,999 పలికింది. ఇది గత రికార్డును సమం చేసింది. గతంలో ‘మనోహరి గోల్డ్ టీ’కి ఈ స్థాయిలో రికార్డు ధర పలికింది. వేలం కేంద్రంలో వరుస రికార్డు ధరలతో మనోహరి టీ ముందుంటోంది. అయితే ఆ తేయాకు తయారీకి కంపెనీకి సొంత తోటలు ఉన్నాయి. నహొర్చుక్బరి ‘బాట్ లీఫ్ ఫ్యాక్టరీ’ ఉత్పత్తి చేసిన ‘గోల్డెన్ పెరల్ టీ’ సోమవారం కిలో రూ.99,999కు అమ్ముడుపోయినట్లు వేలం కేంద్రం కొనుగోలుదారుల సంఘం కార్యదర్శి దినేష్ బిహాని మంగళవారం తెలిపారు. విశేషం ఏమిటంటే ఈ ఫ్యాక్టరీ చిన్న తేయాకు పెంపకందారుల నుంచి ఆకులను సేకరించి ఉత్పత్తి ప్రక్రియ చేపడుతోంది. ఈ టీని గువాహటిలోని ‘అస్సాం టీ ట్రేడర్స్’ కొనుగోలు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
SBI down: దేశంలో స్తంభించిన ఎస్బీఐ సేవలు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు!
-
Technology News
WhatsApp: వీడియోకాలింగ్కు వాట్సాప్ కొత్త ‘అవతార్’!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
-
Politics News
Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
-
General News
KTR: ప్రపంచంలోని టాప్ 5 ఐటీ కంపెనీలకు రెండో అతిపెద్ద కేంద్రం హైదరాబాదే: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?