
Visa: ఇమ్మిగ్రేషన్ వీసా సేవల పథకం పొడిగింపు
దిల్లీ: కేంద్రం ఇమ్మిగ్రేషన్ వీసా ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ (ఐవీఎఫ్‌ఆర్టీ) పథకాన్ని మరో అయిదేళ్లపాటు పొడిగించింది. 2026 మార్చి 31 దాకా ఇది వర్తిస్తుంది. ఇందుగ్గాను రూ.1,364.88 కోట్ల ఆర్థికవ్యయం అంచనా వేశారు. ఈ పథకం ఇమ్మిగ్రేషన్ వీసా జారీ, విదేశీయుల నమోదు, భారత్‌లో వారి కదలికలను కనిపెట్టడానికి సంబంధించిన విధుల అనుసంధానం, సానుకూలతకు ప్రయత్నిస్తుంది. ఇమ్మిగ్రేషన్ వీసా సేవల ఆధునికీకరణ, మెరుగుదల విషయంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం పొడిగింపు సూచిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్త నెట్‌వర్కుతో పనిచేస్తుంది. ఐవీఎఫ్‌ఆర్టీ పథకం అమలులోకి వచ్చాక వీసాల జారీ పెరగడమే కాకుండా.. అంతకుమునుపు 15 నుంచి 30 రోజుల సమయం పడుతుండగా, ఇపుడు కేవలం మూడు రోజుల్లోపే ఈ-వీసాలు జారీ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భారత్ నుంచి అంతర్జాతీయ రాకపోకలు కూడా గత పదేళ్లలో 3.71 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెరిగినట్లు వివరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Eknath Shinde: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం.. శిందే కీలక ప్రకటన
-
Movies News
Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
-
Sports News
IND vs ENG: ప్రమాదకరంగా మారుతున్న జోరూట్, జానీ బెయిర్‌స్టో
-
General News
Hyderabad: ముగిసిన తొర్రూరు లేఅవుట్ ప్లాట్ల ఈ-వేలం
-
Viral-videos News
Viral video: మొసలిని పెళ్లాడిన మేయర్.. అంగరంగవైభవంగా వేడుక!
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు