Corona Virus: కరోనా నాలుగో వేవ్‌ ఇక లేనట్టే!

దేశంలో కొవిడ్‌-19 నాలుగో వేవ్‌ ఉండకపోవచ్చని ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టి.జాకోబ్‌ జాన్‌ గట్టిగా చెబుతున్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన వైరాలజీ....

Updated : 09 Mar 2022 06:45 IST

ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ డాక్టర్‌ జాకోబ్‌ జాన్‌

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 నాలుగో వేవ్‌ ఉండకపోవచ్చని ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టి.జాకోబ్‌ జాన్‌ గట్టిగా చెబుతున్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన వైరాలజీ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ‘పీటీఐ’ వార్తాసంస్థతో మాట్లాడుతూ పలు కీలకాంశాలను వెల్లడించారు. దేశంలో మూడో వేవ్‌ ముగిసిందని.. కొవిడ్‌ మరోసారి ఎండెమిక్‌ దశకు చేరిందని స్పష్టంగా చెప్పొచ్చన్నారు. ఆల్ఫా, బీటా, గామా, ఒమిక్రాన్‌ రకాలకు భిన్నంగా వ్యవహరించే వేరియంట్‌ ఏదైనా పుట్టుకొస్తే తప్ప నాలుగో వేవ్‌ ఉండదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని