UP Elections Result: 42 ఏళ్లుగా ఒకే కుటుంబం.. ఒక్కటే పార్టీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఓ అరుదైన రికార్డు దక్కింది. అక్కడ రాంపుర్‌ఖాస్‌ నియోజకవర్గం నుంచి ఒకే కుటుంబానికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు 1980 నుంచి వరుసగా గెలుస్తుండటమే అందుకు కారణం. గత 42 ఏళ్లలో...

Updated : 11 Mar 2022 07:41 IST

ఈనాడు, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఓ అరుదైన రికార్డు దక్కింది. అక్కడ రాంపుర్‌ఖాస్‌ నియోజకవర్గం నుంచి ఒకే కుటుంబానికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు 1980 నుంచి వరుసగా గెలుస్తుండటమే అందుకు కారణం. గత 42 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్ని గాలులు వీచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా రాంపుర్‌ఖాస్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్‌తివారీ కుటుంబమే గెలుస్తోంది. 1980లో తొలిసారి అక్కడి నుంచి ప్రమోద్‌తివారీ కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించారు. తర్వాత 1985, 89, 91, 93, 96, 2002, 2007, 2012 ఎన్నికల్లో ఆయనే వరుసగా గెలిచారు. 2013లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె ఆరాధనా మిశ్ర పోటీలోకి దిగి ఘన విజయం సాధించారు. 2017 ఎన్నికల్లోనూ ఆమే గెలిచారు. మళ్లీ ఇప్పుడు భాజపా అభ్యర్థిపైనా గెలిచి, తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు