Indian Railway: ఏసీ బోగీల్లో మళ్లీ దుప్పట్లు

ఏసీ బోగీల్లో ప్రయాణికులకు మళ్లీ దుప్పట్లు, రగ్గులు(బ్లాంకెట్‌) అందనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్నాళ్లు భోజనాలతో పాటు ఈ సేవలను రైల్వేశాఖ రద్దుచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా

Updated : 11 Mar 2022 07:57 IST

దిల్లీ: ఏసీ బోగీల్లో ప్రయాణికులకు మళ్లీ దుప్పట్లు, రగ్గులు(బ్లాంకెట్‌) అందనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్నాళ్లు భోజనాలతో పాటు ఈ సేవలను రైల్వేశాఖ రద్దుచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. దుప్పట్లు, రగ్గులు, కర్టెన్లను తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని అన్ని జోన్ల జనరల్‌ మేనేజర్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు భోజనాలు సైతం అందిస్తున్నారు. అయితే వివిధ వర్గాల ప్రయాణికులకు రాయితీలను మాత్రం పునరుద్ధరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని