నటుడు విశాల్‌ రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలి: మద్రాసు హైకోర్టు

లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని నటుడు విశాల్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం..

Updated : 13 Mar 2022 09:41 IST

చెన్నై(ప్యారిస్‌), న్యూస్‌టుడే: లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని నటుడు విశాల్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అప్పుగా తీసుకున్న రూ.21.29 కోట్లు ఇవ్వకుండా.. ‘వీరమే వాగై సుడుం’ అనే చిత్రాన్ని విడుదల చేయడానికి, శాటిలైట్‌, ఓటీటీ హక్కుల విక్రయానికి విశాల్‌ సిద్ధమయ్యారని, వాటిపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు శనివారం జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ రామమూర్తి ఎదుట విచారణకు వచ్చింది. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్‌ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్‌ చేయాలని విశాల్‌ను ఆదేశించారు. విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని