Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు 8,72,243

కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల పరిధిలో 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బుధవారం లోక్‌సభలో శివసేన సభ్యుడు అరవింద్‌ సావంత్‌ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ ఇచ్చిన సమాధానం

Published : 17 Mar 2022 07:53 IST

ఈనాడు, దిల్లీ: కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల పరిధిలో 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బుధవారం లోక్‌సభలో శివసేన సభ్యుడు అరవింద్‌ సావంత్‌ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్రంలోని 77 మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్ల పరిధిలో 40,04,941 పోస్టులు మంజూరుకాగా, ప్రస్తుతం అందులో 31,32,698 మంది పనిచేస్తున్నట్లు చెప్పారు. రక్షణ (సివిల్‌) విభాగంలో 6,33,139 పోస్టులకుగాను 3,85,637 మందే పనిచేస్తున్నారు. ఈ ఒక్క మంత్రిత్వశాఖ పరిధిలోనే 2,47,502 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హోంశాఖలో 1,28,842, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో 90,050, రెవెన్యూ విభాగంలో 76,327 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది.

రైల్వేలో ఖాళీల భర్తీ ప్రక్రియ

రైల్వేలో అత్యధిక ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ బుధవారం లోక్‌సభకు చెప్పారు. ఇక్కడున్న  2,94,687 ఖాళీల్లో 1,53,974 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేసినట్లు తెలిపారు. ఇంకా 1,40,713 ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని, ఇది పరీక్షల దశలో ఉందని వివరించారు. నోటిఫై చేసిన ఖాళీల్లో దక్షిణమధ్య రైల్వేలో 16,736, సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌బీ పరిధిలో 10,038 ఉన్నట్లు చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి స్పష్టీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని