ఇక భారత్‌లోకి విదేశీ పర్యాటకులు.. 156 దేశాల ఈ-టూరిస్ట్‌ వీసాల పునరుద్ధరణ

పర్యాటక రంగంలో ఉత్సాహాన్ని నింపే చర్యను కేంద్రం తీసుకుంది. కరోనా కారణంగా 156 దేశాల ఈ-టూరిస్ట్‌ వీసాలపై 2020 మార్చిలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని తొలగించింది. ఆ దేశాలకు కొత్త ఈ-వీసాలనూ మంజూరు చేయాలని నిర్ణయించింది.

Updated : 17 Mar 2022 09:13 IST

దిల్లీ: పర్యాటక రంగంలో ఉత్సాహాన్ని నింపే చర్యను కేంద్రం తీసుకుంది. కరోనా కారణంగా 156 దేశాల ఈ-టూరిస్ట్‌ వీసాలపై 2020 మార్చిలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని తొలగించింది. ఆ దేశాలకు కొత్త ఈ-వీసాలనూ మంజూరు చేయాలని నిర్ణయించింది. అమెరికా, జపాన్‌ జాతీయుల పదేళ్ల పర్యాటక వీసాలపై విధించిన నిషేధాన్నీ ఎత్తివేసింది. వీరికి కొత్త పదేళ్ల వీసాలనూ జారీ చేయనుంది. అర్హులైన అన్ని దేశాల పౌరులూ ఇక నుంచి సాధారణ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టూరిస్ట్‌, ఈ-టూరిస్ట్‌ వీసా గల విదేశీయులు సముద్ర, విమాన మార్గాల్లోని ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పోస్టుల ద్వారా మాత్రమే భారత్‌లో ప్రవేశించాలి. నదీ, భూమార్గాల ద్వారా అనుమతి లేదు. అఫ్గాన్‌ జాతీయులకు ఈ నిబంధనలు వర్తించవు. వీరికి హోంమంత్రిత్వశాఖ నిర్ధారించిన ప్రత్యేక వీసా ప్రక్రియ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని