14 ఏళ్ల అమ్మాయి.. 200 క్లాసికల్‌ చిత్రాలకు రివ్యూలు

సాధారణంగా ఆటలంటే ఇష్టపడే పిల్లలు.. పుస్తకాలు చదవమనే సరికి మొహం చాటేస్తారు. అలాంటిది ఓ అమ్మాయి చిన్న వయసులోనే రచయితగా మారింది. పుస్తకాలు, పద్యాలు, సినిమా రివ్యూలు రాస్తూ

Updated : 21 Mar 2022 09:16 IST

సాధారణంగా ఆటలంటే ఇష్టపడే పిల్లలు.. పుస్తకాలు చదవమనే సరికి మొహం చాటేస్తారు. అలాంటిది ఓ అమ్మాయి చిన్న వయసులోనే రచయితగా మారింది. పుస్తకాలు, పద్యాలు, సినిమా రివ్యూలు రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన 14 ఏళ్ల సనీషా.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆటపాటలు, చదువుతో గడిపే ఆ వయసుకే సనీషా.. ఇంగ్లిష్‌, మలయాళంలో పుస్తకాలు రాస్తూ రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. 6వ తరగతిలో ఉండగా రచనలపై పుట్టిన ఇష్టం ఆమెను ఇప్పటివరకు 13 పుస్తకాలు రాసేలా చేసింది. వివిధ నవలలు, చిన్నచిన్న కథలు, పద్యాలు రాసింది. అంతేకాదు రెండు వందల క్లాసికల్‌ చిత్రాలకు రివ్యూలు కూడా రాసింది. సనీషా ప్రతిభను గుర్తించిన కేరళ ప్రభుత్వం.. ‘ఉజ్వల బాల్యం’ పురస్కారాన్ని అందజేసింది. ఎన్‌ఎన్‌ కాక్కడ్‌ అవార్డు, రాయల్‌ కామన్‌వెల్త్‌ సొసైటీ అవార్డులనూ ఆ బాలిక అందుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని