అసమ్మతివాదులతో సోనియా భేటీపై సునీల్‌ జాఖఢ్‌ అభ్యంతరం

కాంగ్రెస్‌లో అసమ్మతివాదులుగా ముద్రపడిన జి-23 నేతలతో అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ కావడంపై పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ అభ్యంతరం తెలిపారు. పార్టీ అంతర్గత సమస్యలను

Published : 24 Mar 2022 05:33 IST

చండీగఢ్‌: కాంగ్రెస్‌లో అసమ్మతివాదులుగా ముద్రపడిన జి-23 నేతలతో అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ కావడంపై పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ అభ్యంతరం తెలిపారు. పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అసమ్మతివాదులకు అతి చనువు ఇవ్వడం ద్వారా మరింత అసమ్మతిని ప్రోత్సహించినట్లు అవుతుందని, అదే సమయంలో పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచినట్లవుతుందని బుధవారం ఆయన ఒక ట్వీట్‌లో హెచ్చరించారు. జి-23 నేతలతో సోనియా గాంధీ భేటీపై వచ్చిన వార్తాపత్రికల క్లిప్పులను ఆ ట్వీట్‌కు జత చేశారు. సోనియా ఇటీవల గులామ్‌ నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, మనీశ్‌ తివారీలతో దిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. మరికొందరు నేతలతోనూ మాట్లాడనున్నారని సమాచారం. జి-23 నేతలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో, కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీ పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పిస్తారనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీలు జరుగుతున్నాయి. పంజాబ్‌ మాజీ సీఎం చన్నీని సమర్థిస్తున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంబికా సోనీపైనా సునీల్‌ జాఖడ్‌ పరోక్ష విమర్శలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని