ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై నిపుణుల కమిటీ

ఉత్తరాఖండ్‌లో సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్‌ గురువారం తన తొలి భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై నిపుణులతో

Published : 25 Mar 2022 05:15 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్‌ గురువారం తన తొలి భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యూసీసీకి సంబంధించి ఇచ్చిన హామీ అమలుకు ధామీ రంగం సిద్ధం చేస్తున్నారు. మన దేశంలో యూసీసీని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా. 1963లో మన దేశంలో విలీనం అయిన తర్వాత అప్పటి వరకూ అమలులో ఉన్న పోర్చుగీసు పౌరస్మృతి-1867ను ఆ రాష్ట్రం కొనసాగిస్తోంది. ఇది ఆ రాష్ట్రంలోని అన్ని మతాలు, వర్గాల వారికీ వర్తిస్తోంది. ఉత్తరాఖండ్‌ ప్రత్యేక సంస్కృతిని, మత వారసత్వాన్ని కలిగి ఉందని, దానిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ధామీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని