Supreme Court: అధికారుల్ని ఇళ్లు ఖాళీ చేయిస్తోంది బౌన్సర్లా!

కేంద్ర ప్రభుత్వ అధికారుల్ని ఇళ్లు ఖాళీ చేయించేందుకు ఓ ప్రైవేటు కంపెనీ ఏకంగా బౌన్సర్లను పంపుతుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. దిల్లీలో ఖాన్‌ మార్కెట్‌ సమీపంలోని సుజన్‌సింగ్‌ పార్క్‌ ఫ్లాట్స్‌లో ప్రభుత్వ

Updated : 26 Mar 2022 09:29 IST

సుప్రీంకోర్టు విస్మయం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ అధికారుల్ని ఇళ్లు ఖాళీ చేయించేందుకు ఓ ప్రైవేటు కంపెనీ ఏకంగా బౌన్సర్లను పంపుతుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. దిల్లీలో ఖాన్‌ మార్కెట్‌ సమీపంలోని సుజన్‌సింగ్‌ పార్క్‌ ఫ్లాట్స్‌లో ప్రభుత్వ అధికారులు నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి అద్దె బకాయిలు రాకపోవడంతో ఫ్లాట్స్‌ యజమాని శోభాసింగ్‌ అండ్‌ సన్స్‌.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా 2020 జనవరిలో కంపెనీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఫ్లాట్లను స్వాధీనం చేసుకొనేందుకు ఇటీవల ఆ కంపెనీ తరఫున బౌన్సర్లు రంగంలోకి దిగారు. ఈ ఘటనను అసాధారణ అంశంగా పరిగణించి విచారణకు స్వీకరించాలంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ కపూర్‌ శుక్రవారం సుప్రీంకోర్టును కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని జస్టిస్‌ క్రిష్ణ మురారి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం వెంటనే స్పందించింది. ‘‘భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు బౌన్సర్లను ఎలా పంపుతారు? ఈ కేసును వచ్చే వారమే లిస్టింగ్‌ చేయించండి’’ అంటూ రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని