Sri Sri Daughter: మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జిగా శ్రీశ్రీ కుమార్తె మాలా

ప్రముఖ రచయిత శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), సరోజ దంపతుల కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. శ్రీశ్రీ కుమార్తెగా తెలుగువారికి సుపరిచితురాలైన

Updated : 26 Mar 2022 06:58 IST

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: ప్రముఖ రచయిత శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), సరోజ దంపతుల కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. శ్రీశ్రీ కుమార్తెగా తెలుగువారికి సుపరిచితురాలైన మాలా పాఠశాల విద్యను చెన్నైలోని సెయింట్‌ జాన్‌, కేసరి పాఠశాలలో పూర్తిచేశారు. న్యాయవాద వృత్తిపై ఆసక్తితో చెన్నైలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాలలో కోర్సు అభ్యసించారు. 1989లో న్యాయవాద వృత్తిని చేపట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో కీలక కేసులను వాదించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2020లో పుదుచ్చేరిలో ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులై.. ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. మద్రాస్‌ హైకోర్టులోనూ సేవలందించారు. నిడుమోలు మాలా భర్త రాధా రమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌లో అధికారిగా ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ జయప్రశాంత్‌ కూడా న్యాయవాదే. చిన్నకుమారుడు సాయి ప్రదీప్‌ సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని