Updated : 28 Mar 2022 08:42 IST

Nitish Kumar: బిహార్‌ సీఎం నీతీశ్‌పై దాడి..

నిందితుడి అరెస్ట్‌

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌పై శంకర్‌ కుమార్‌ వర్మ (32) అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు. పట్నాకు సమీపంలోని సీఎం సొంత ఊరు బఖ్తియార్‌పుర్‌లో ఆదివారం ఈ అనూహ్య సంఘటన జరిగింది. దాడి దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో స్వాతంత్య్ర సమరయోధుడు షిల్‌భద్ర యాజీ  విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నీతీశ్‌ హాజరయ్యారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వేదికపైకి ఎక్కిన యువకుడు సీఎం వీపుపై కొట్టాడు. భద్రతా సిబ్బంది.. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతని మానసిక స్థితి సరిగాలేదని తెలుస్తోంది. చుట్టూ భద్రతా సిబ్బంది ఉండగా ముఖ్యమంత్రిపై ఇలా దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తోంది. యువకుడిపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోవద్దని, తగిన వైద్యసాయం అందించాలని  నీతీశ్‌ సూచించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని