Smart Knob: గ్యాస్‌ లీకేజీని పసిగట్టే ‘స్మార్ట్‌ నాబ్‌’

స్టవ్‌ బర్నర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయ్యే ప్రమాద పరిస్థితుల్ని గుర్తించి ఆటోమేటిక్‌గా గ్యాస్‌ను ఆఫ్‌ చేసుకునే సాంకేతికత వచ్చింది. దీనికోసం ‘స్మార్ట్‌ నాబ్‌’ను స్టవ్‌కు అమర్చారు....

Updated : 30 Mar 2022 07:53 IST

ప్యారిస్‌ (చెన్నై), న్యూస్‌టుడే: స్టవ్‌ బర్నర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయ్యే ప్రమాద పరిస్థితుల్ని గుర్తించి ఆటోమేటిక్‌గా గ్యాస్‌ను ఆఫ్‌ చేసుకునే సాంకేతికత వచ్చింది. దీనికోసం ‘స్మార్ట్‌ నాబ్‌’ను స్టవ్‌కు అమర్చారు ఐఐటీ మద్రాస్‌కు చెందిన స్టార్టప్‌ డిగ్యాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు. ఈ సంస్థ హెచ్‌పీసీఎల్‌తో కలిసి స్టవ్‌లకు ఈ సాంకేతికతను అనుసంధానించి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు మంగళవారం ఐఐటీ మద్రాస్‌ ఇంక్యుబేషన్‌ సెల్‌ ప్రకటించింది. బర్నర్‌ల దగ్గర గ్యాస్‌ లీకేజీని పసిగట్టే ‘బ్యాటరీ ఫ్రీ నాన్‌-ఇన్వాజివ్‌ ఫ్లేమ్‌ ఫెయిల్యూర్‌ డివైజ్‌’ను అమర్చారు. ఇది సెన్సర్‌లా పని చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఈ తరహా పరికరం ప్రపంచంలోనే తొలిసారి అందుబాటులోకి తెస్తున్నట్లు  ప్రతినిధులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని