అధీకృత దర్యాప్తు సంస్థలే ఫోన్లు ట్యాపింగ్‌ చేయగలవు: కేంద్రం

ఫోన్లు సహా ఎలక్ట్రానిక్‌ విధానంలో సమాచారాన్ని చేరవేసే ఏ సాధనాన్నైనా ట్యాప్‌ చేయడం, రహస్యంగా ఛేదించడం అధీకృత దర్యాప్తు సంస్థలకే సాధ్యమని కేంద్రం స్పష్టంచేసింది.

Published : 30 Mar 2022 05:22 IST

దిల్లీ: ఫోన్లు సహా ఎలక్ట్రానిక్‌ విధానంలో సమాచారాన్ని చేరవేసే ఏ సాధనాన్నైనా ట్యాప్‌ చేయడం, రహస్యంగా ఛేదించడం అధీకృత దర్యాప్తు సంస్థలకే సాధ్యమని కేంద్రం స్పష్టంచేసింది. వాట్సప్‌ సహా ఏదైనా డిజిటల్‌ సమాచారంపై నిఘా వేయడానికి జాతీయ లేదా అంతర్జాతీయ సంస్థలకు అధికారం ఉందా అని లోక్‌సభలో వచ్చిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర మంగళవారం సమాధానమిచ్చారు. ఫోన్లను ట్యాపింగ్‌ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమీక్ష తీరుపైనా చట్టంలో నిబంధనలు ఉన్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని