అయిదేళ్లలో 41% పెరిగిన నీట్‌ అభ్యర్థులు

దేశంలో నీట్‌-యూజీ పరీక్షలు రాసే అభ్యర్థులు గత అయిదేళ్లలో 41.78% మంది పెరిగారు. 2017లో మొత్తం అభ్యర్థుల సంఖ్య 11,38,890 ఉండగా, 2021 నాటికి ఆ సంఖ్య 16,14,777కి చేరింది.

Published : 30 Mar 2022 05:27 IST

ఎంబీబీఎస్‌ సీట్లలో 33శాతమే వృద్ధి

ఈనాడు, దిల్లీ: దేశంలో నీట్‌-యూజీ పరీక్షలు రాసే అభ్యర్థులు గత అయిదేళ్లలో 41.78% మంది పెరిగారు. 2017లో మొత్తం అభ్యర్థుల సంఖ్య 11,38,890 ఉండగా, 2021 నాటికి ఆ సంఖ్య 16,14,777కి చేరింది. ఇదే సమయంలో ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్య 42.27% మేర పెరగ్గా, ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య మాత్రం 33.10శాతం మాత్రమే వృద్ధి చెందింది. 2014లో ఉన్న 51,348 సీట్లు 2021 నాటికి 89,875కి చేరాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ఏపీలోని 13 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,410 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా.. 18 ప్రైవేటు కాలేజీల్లో 2,800 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,790.. 23 ప్రైవేటు కాలేజీల్లో 3,550 సీట్లు ఉన్నట్లు చెప్పారు. దేశంలో అత్యధిక ఎంబీబీఎస్‌ సీట్లు తమిళనాడు (10,425), కర్ణాటక (9,695), మహారాష్ట్ర (9,450), ఉత్తర్‌ప్రదేశ్‌ (8,678), గుజరాత్‌ (5,650), తెలంగాణ (5,340), ఆంధ్రప్రదేశ్‌ (5,210)ల్లో ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని