అరుదైన శిశువు.. రెండు తలలు, మూడు చేతులతో జననం

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. జావ్రా గ్రామానికి చెందిన షాహీన్‌ అనే మహిళ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరగా.. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శిశువుకు రెండు తలలు

Published : 31 Mar 2022 07:31 IST

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. జావ్రా గ్రామానికి చెందిన షాహీన్‌ అనే మహిళ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరగా.. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శిశువుకు రెండు తలలు ఉండటమే గాక మూడు చేతులు ఉన్నాయి. డెలివరీకి ముందు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో మహిళ కడుపులో కవలలు ఉన్నట్లు తెలిసిందని, తీరా ప్రసవం అయ్యాక చూస్తే ఒకే శిశువుకు రెండు తలలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. రెండు చేతులు సాధారణంగానే ఉండగా.. మూడో చెయ్యి రెండు తలల మధ్య నుంచి ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని పాలీసెఫాలీ కండిషన్‌ అంటారని, అతికొద్ది మంది చిన్నారుల్లోనే ఇలా అత్యంత అరుదుగా జరుగుతుందని వివరించారు. ఈ శిశువును ఇండోర్‌లోని ఎంవై ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని