నీట్‌ పీజీ అఖిల భారత కోటా మాప్‌ అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ రద్దు

నీట్‌ పీజీ 2021-22 కౌన్సెలింగ్‌లో అఖిల భారత కోటాలో ఖాళీగా ఉన్న (మాప్‌అప్‌ రౌండ్‌) సీట్ల భర్తీ ప్రక్రియను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. ఒకటి, రెండో దశల కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పూర్తయిన

Published : 01 Apr 2022 05:29 IST

146 కొత్త సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు

దిల్లీ: నీట్‌ పీజీ 2021-22 కౌన్సెలింగ్‌లో అఖిల భారత కోటాలో ఖాళీగా ఉన్న (మాప్‌అప్‌ రౌండ్‌) సీట్ల భర్తీ ప్రక్రియను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. ఒకటి, రెండో దశల కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పూర్తయిన తర్వాత కొత్తగా 146 సీట్లను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రకటించిన నిబంధనలను తప్పుపట్టింది. కొత్త సీట్లకు రెండు దశల కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందిన వైద్య విద్యార్థులు కూడా అర్హులేనని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది. 146 సీట్లలో వారికీ అవకాశం కల్పించేలా మరోసారి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని స్పష్టం చేసింది. అఖిల భారత కోటా లేదా రాష్ట్రాల కోటాలో సీట్లు పొందిన వారూ ఈ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించింది. ఆ వైద్య విద్యార్థుల నుంచి 24 గంటల వ్యవధిలో ఐచ్ఛికాలను స్వీకరించి ఆ తర్వాత 72 గంటల వ్యవధిలో ఆ ప్రక్రియను ముగించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ను ధర్మాసనం ఆదేశించింది.

మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌లో కొత్తగా 146 సీట్లను అందుబాటులోకి తీసుకురావడం, వాటిలో తమకు అవకాశం కల్పించకపోవడంపై రెండు దశల కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వైద్య విద్యార్థులు కొందరు అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా యథాపూర్వక స్థితిని కొనసాగించాలని బుధవారం ఆదేశాలు వెలువడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మార్చి 16నాటి డీజీహెచ్‌ఎస్‌ నోటీసులో ఏకరూప విధానం లోపించిందని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని