కోర్టు ఉత్తర్వులను గౌరవించని అధికారులకు... జైలు శిక్షే సరైనది

న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవించని అధికారులకు జైలు శిక్షే సరైనదని మద్రాసు హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చెన్నై నగరంలో నిబంధనలు అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించినా.. చర్యలు

Published : 02 Apr 2022 07:45 IST

మద్రాసు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవించని అధికారులకు జైలు శిక్షే సరైనదని మద్రాసు హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చెన్నై నగరంలో నిబంధనలు అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించినా.. చర్యలు తీసుకోని దైవశిఖామణి అనే అధికారికి చెన్నై కార్పొరేషన్‌ మూడేళ్లపాటు వేతన పెంపును నిలిపివేస్తూ గతంలో ఉత్తర్వులిచ్చింది. దీన్ని ఆయన హైకోర్టులో సవాలు చేశారు. కార్పొరేషన్‌ ఉత్తర్వులను కోర్టు రద్దుచేసింది. దీనిపై కార్పొరేషన్‌ అప్పీలు చేసింది. గతేడాది అక్టోబరులో ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు... పదోన్నతి జాబితాలో దైవశిఖామణి పేరునూ పరిశీలించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం దీనిపై మళ్లీ విచారణ జరిగింది. కోర్టు స్టే ఉత్తర్వులు ఇస్తే తప్ప అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు వెంటనే తమ నిర్ణయాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించని అధికారులకు జరిమానా వేయడం కంటే.. జైలుశిక్షే ప్రధానంగా విధించాలని వ్యాఖ్యానించింది. వారిని సస్పెండ్‌ చేయాలని, సస్పెన్షన్‌ ఎత్తేసిన తర్వాత కూడా అప్రాధాన్య పోస్టులోనే నియమించాలని తెలిపింది. భవన యజమానుల అప్పీళ్లపై విచారించి.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారి నుంచి లంచాలు తీసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమని ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 4వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని