Covaxin: కొవాగ్జిన్ రెండు డోసులతో కొవిడ్ నుంచి అత్యంత రక్షణ
కొవాగ్జిన్ రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌కు గురైనవారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు అత్యంత అధిక స్థాయిలో ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఆందోళనకర
ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
దిల్లీ: కొవాగ్జిన్ రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌కు గురైనవారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు అత్యంత అధిక స్థాయిలో ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఆందోళనకర వేరియంట్లు అయిన బీటా, డెల్టా, ఒమిక్రాన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్ టీకా దోహదపడుతున్నట్టు తేలింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యాన పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డా.ప్రగ్యా యాదవ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఒమిక్రాన్ కారణంగా దేశంలో మూడోదశ కొవిడ్ ఉద్ధృతి నెలకొనడంతో... కొవాగ్జిన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ అధ్యయనం సాగించారు. వివిధ వయసుల వారిలో ఈ టీకా పనితీరు, రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ సోకినవారిలో రోగనిరోధక స్పందనలు ఎలా ఉన్నాయన్నది పరిశోధకులు నిశితంగా అధ్యయనం చేశారు.
సగటున రెండో డోసు తీసుకున్న 43 రోజుల తర్వాత బ్రేక్ త్రూ కేసులు నమోదవుతున్నట్టు లెక్కగట్టారు. ఇలాంటి 95% కేసుల్లో లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయని, కొందరిలో అసలు లక్షణాలే ఉండటం లేదని గుర్తించారు. రెండు డోసుల తర్వాత కొవిడ్‌కు గురైన వారిలో... అన్నిరకాల ఆందోళనకర వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేలా హెచ్చుస్థాయి రోగనిరోధక ప్రతిస్పందనలు కనిపించినట్టు వారు గుర్తించారు. కొవిడ్‌కు గురైన తర్వాత కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ రోగనిరోధక శక్తి అధిక స్థాయిలో ఉంటున్నట్టు అధ్యయనంలో తేలింది. రెండో డోసు తీసుకున్న మూడు నెలల తర్వాత టీకా కారణంగా లభించే రోగనిరోధకశక్తి క్రమంగా తగ్గుతోందని... బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా ఆందోళనకర వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని పరిశోధకులు సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్ఫెక్షన్ పత్రిక అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!