స్వదేశాల్లో వైద్య విద్యార్థుల ప్రాక్టికల్‌ శిక్షణ

విదేశీ వైద్య విద్యార్థులు వారి వారి మాతృ దేశాల్లో అభ్యాసపూర్వక శిక్షణ (ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) కొనసాగించేందుకు ఉక్రెయిన్‌ వైద్య విశ్వవిద్యాలయాలు అనుమతించాయి. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో

Published : 08 Apr 2022 04:39 IST

అనుమతించిన ఉక్రెయిన్‌ విశ్వవిద్యాలయాలు

దిల్లీ: విదేశీ వైద్య విద్యార్థులు వారి వారి మాతృ దేశాల్లో అభ్యాసపూర్వక శిక్షణ (ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) కొనసాగించేందుకు ఉక్రెయిన్‌ వైద్య విశ్వవిద్యాలయాలు అనుమతించాయి. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో తమ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించాలని వివిధ దేశాలకు ఆ విద్యా సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రష్యా దాడి తదనంతర పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ను వీడి వేల మంది వైద్య విద్యార్థులు వారి వారి స్వదేశాలకు చేరుకున్నారు. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ అభ్యాసపూర్వక శిక్షణకు తమ విద్యార్థులు దూరమవుతున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు అవకాశం ఇవ్వాలని ‘డినిప్రో స్టేట్‌ మెడికల్‌ యూనివర్శిటీ’ (డీఎంఎస్‌యు) కోరింది. వి.ఎన్‌.కరజిన్‌ ఖర్కివ్‌ నేషనల్‌ యూనివర్సిటీ, నేషనల్‌ పిరొగొవ్‌ మెమోరియల్‌ యూనివర్సిటీలు కూడా విదేశీ విద్యార్థులకు ఈ తరహా అనుమతులను ఇచ్చాయి. అభ్యాసపూర్వక శిక్షణ అనంతరం సంబంధిత ఆసుపత్రి వైద్య విద్యార్థులకు శిక్షణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తే దానిని తాము పరిగణనలోకి తీసుకుంటామని తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని