Cowin Portal: కొవిన్‌ పోర్టల్‌లో మరో కొత్త ఫీచర్‌

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కొవిన్‌ పోర్టల్‌లో కొత్త ఫీచర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. టీకా తీసుకున్న తేదీకి సంబంధించి ధ్రువపత్రంలో పొరపాటు దొర్లితే మార్చుకునేందుకు వీలు

Updated : 08 Apr 2022 09:13 IST

వ్యాక్సినేషన్‌ తేదీని సరిదిద్దుకునే వీలు

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కొవిన్‌ పోర్టల్‌లో కొత్త ఫీచర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. టీకా తీసుకున్న తేదీకి సంబంధించి ధ్రువపత్రంలో పొరపాటు దొర్లితే మార్చుకునేందుకు వీలు కల్పించింది. వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాల్లో పేరు, పుట్టిన సంవత్సరం, జెండర్‌ వంటివాటిలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఇప్పటికే కొవిన్‌ పోర్టల్‌లో అవకాశం ఉంది. తాజాగా టీకా వేసుకున్న తేదీ తప్పుపడితే మార్చుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి వికాశ్‌ శీల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని