ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు.. వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్‌

వైద్య విద్యలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లుతుందని మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు

Published : 08 Apr 2022 04:39 IST

తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: వైద్య విద్యలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లుతుందని మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ‘ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించడం చెల్లుతుంది. రిజర్వేషన్‌ కల్పించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఐదేళ్ల తర్వాత ఈ అంశాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలి’ అని నిర్దేశిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంలో దాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్‌ అమల్లో ఉండగా, మిగిలిన 31 శాతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో జనరల్‌ కేటగిరీలో అర్హులైన విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎయిడెడ్‌ విద్యార్థులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని, రిజర్వేషన్‌ కల్పనలో పక్షపాతం చూపుతుందని మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. జనరల్‌ కేటగిరీకి కేటాయించిన 31 శాతంలో 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించలేదని, మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు నష్టం లేదని విచారణ సమయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది గతంలో కోర్టుకు నివేదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని