Crime News: 60 అడుగుల వంతెనను మాయం చేసిన దొంగలు!

బిహార్‌లో కొందరు దొంగలు ఏకంగా 60 అడుగుల ఐరన్‌ బ్రిడ్జిని మాయం చేశారు. రోహ్తాస్‌ జిల్లా  అమియావార్‌లో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఉంది. ఇది 20 టన్నుల బరువుంటుంది. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు

Updated : 09 Apr 2022 09:22 IST

బిహార్‌లో కొందరు దొంగలు ఏకంగా 60 అడుగుల ఐరన్‌ బ్రిడ్జిని మాయం చేశారు. రోహ్తాస్‌ జిల్లా  అమియావార్‌లో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఉంది. ఇది 20 టన్నుల బరువుంటుంది. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు పక్కా పథకం పన్నారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులమని స్థానికులకు చెప్పి గ్యాస్‌ కట్టర్లతో ఇనుమును కట్‌ చేశారు. దాన్ని వాహనంలో లోడ్‌ చేసి  తీసుకెళ్లారు. మూడు రోజుల్లోనే బ్రిడ్జిని మాయం చేశారు. ఆ తర్వాత వారు దొంగలన్న విషయం స్థానికులకు తెలిసి కంగుతిన్నారు. ఆరా కెనాల్‌పై నిర్మించిన ఈ బ్రిడ్జి పదుల సంఖ్యలో గ్రామాలను కలిపేది. శిథిలావస్థకు చేరిన కారణంగా ప్రస్తుతం దీన్ని ఉపయోగించడం లేదు. దీంతో కూలగొట్టాలని గ్రామస్థులు గతంలో అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు దర్జాగా బ్రిడ్జిని దోచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని