కొవాగ్జిన్‌ను గుర్తించిన జపాన్‌

భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కరోనా టీకా కొవాగ్జిన్‌ను గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేరుస్తూ జపాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా భారత్‌, జపాన్‌ల మధ్య ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ విషయాన్ని

Published : 09 Apr 2022 05:58 IST

భారత్‌ బయోటెక్‌ వెల్లడి

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కరోనా టీకా కొవాగ్జిన్‌ను గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేరుస్తూ జపాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా భారత్‌, జపాన్‌ల మధ్య ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ సంస్థ ట్విటర్‌లో వెల్లడించింది. ‘‘కొవాగ్జిన్‌ను జపాన్‌ ప్రభుత్వం గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేర్చింది. ఈ నెల 10 నుంచి భారత్‌, జపాన్‌ మధ్య ప్రయాణాలను మరింత సులభతరం చేసే దిశగా ఈ చర్య చేపట్టింది’’ అని ట్విటర్‌లో పేర్కొంది. ఆస్ట్రేలియా సహా మరిన్ని దేశాలు ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాల కోసం కొవాగ్జిన్‌ను గుర్తించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని