గుజరాత్‌లో తొలి ఎక్స్‌ఈ కేసు

గుజరాత్‌లో కొవిడ్‌-19కు సంబంధించి ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ తొలి కేసు నమోదైనట్లు అధికారులు శనివారం ప్రకటించారు. గత నెల్లో ముంబయి నుంచి వడోదరా వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ ఉపరకమైన ఎక్స్‌ఈ సోకిందని వెల్లడించారు.

Published : 10 Apr 2022 05:47 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కొవిడ్‌-19కు సంబంధించి ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ తొలి కేసు నమోదైనట్లు అధికారులు శనివారం ప్రకటించారు. గత నెల్లో ముంబయి నుంచి వడోదరా వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ ఉపరకమైన ఎక్స్‌ఈ సోకిందని వెల్లడించారు. బాధితుడు వడోదరాలో ఉన్నప్పుడు మార్చి 12న కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆ మర్నాడే ఆయన స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా ముంబయి తిరిగి వెళ్లిపోయారని చెప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని ప్రయోగశాల ఇచ్చిన నివేదిక ప్రకారం అతనికి సోకింది ఎక్స్‌ఈ వేరియంట్‌ అని తేలిందన్నారు. కోల్‌కతాలోని ప్రయోగశాల కూడా బాధితుడి నమూనాలను పరీక్షించి ఎక్స్‌ఈ వేరియంట్‌గానే నిర్ధరించిందన్నారు. బాధితుడు ప్రస్తుతం ముంబయిలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాధితుడితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురి నమూనాలను సేకరించి పరీక్షించగా.. నెగెటివ్‌గా వెల్లడైందని గుజరాత్‌ అదనపు సీఎస్‌ (ఆరోగ్యం) మనోజ్‌ అగర్వాల్‌ తెలిపారు. గతంలో వచ్చిన కరోనా స్ట్రెయిన్‌ల కంటే ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ ఎక్కువ సాంక్రమికశక్తితో ఉన్నట్లు కనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని