మూడో డోసుగా ముందు తీసుకున్న టీకానే..

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఆదివారం నుంచి ప్రారంభిస్తున్న కొవిడ్‌ టీకా ముందుజాగ్రత్త (మూడో) డోసుపై కేంద్ర ప్రభుత్వం శనివారం వివరాలను వెల్లడించింది. తొలి రెండు డోసుల కింద ఏ వ్యాక్సిన్‌ను పొందారో మూడో డోసుగా కూడా

Published : 10 Apr 2022 05:46 IST

కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఆదివారం నుంచి ప్రారంభిస్తున్న కొవిడ్‌ టీకా ముందుజాగ్రత్త (మూడో) డోసుపై కేంద్ర ప్రభుత్వం శనివారం వివరాలను వెల్లడించింది. తొలి రెండు డోసుల కింద ఏ వ్యాక్సిన్‌ను పొందారో మూడో డోసుగా కూడా దాన్నే తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శనివారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీచేశారు. 1963 - 2004 సంవత్సరాల మధ్య పుట్టినవారు.. రెండో డోసు తీసుకొని కనీసం 9 నెలలు (39 వారాలు లేదా 273 రోజులు) దాటితే ఇప్పుడు మూడో డోసును పొందొచ్చని తెలిపారు. మూడో డోసును ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా ‘వాక్‌-ఇన్‌’ రిజిస్ట్రేషన్‌ ద్వారా పొందొచ్చని వివరించారు. ‘‘మూడో డోసు పొందడానికి మళ్లీ ప్రత్యేకంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రం జారీచేసిన వ్యాక్సినేషన్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి రికార్డును వ్యాక్సినేటరే గుర్తించి, గుర్తింపుకార్డు ద్వారా వివరాలను ధ్రువీకరించుకొని టీకా అందించడంతోపాటు, ఆ వివరాలను కొవిన్‌లో నమోదు చేయాలి’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని