ఆలయ గుండంలోని బిందెడు నీరు రూ.1.30 లక్షలు

ఒడిశా భువనేశ్వర్‌లోని ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న మరీచి గుండంలోని బిందె నీటిని రూ.1.30 లక్షలకు విక్రయించారు. లింగరాజస్వామి రుకుణ యాత్రలో

Published : 10 Apr 2022 08:15 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఒడిశా భువనేశ్వర్‌లోని ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న మరీచి గుండంలోని బిందె నీటిని రూ.1.30 లక్షలకు విక్రయించారు. లింగరాజస్వామి రుకుణ యాత్రలో భాగంగా ఏటా అశోక అష్టమి ముందు రోజు రాత్రి మరీచి గుండంలోని నీటిని విక్రయించేందుకు వేలం నిర్వహిస్తారు. లింగరాజ ఆలయంలో ఉండే బడునియోగ్‌ వర్గానికి చెందిన సేవాయత్‌లు ఈ ప్రక్రియ చేపడతారు. శుక్రవారం రాత్రి వేలంపాట జరగగా.. తొలి బిందె నీటి ధర రూ.25 వేలతో ప్రారంభమైంది. ఆ బిందెను భువనేశ్వర్‌లోని బారాముండా ప్రాంతానికి చెందిన దంపతులు రూ.1.30 లక్షలకు కొనుక్కున్నారు. రెండో బిందెను రూ.47 వేలు, మూడోదాన్ని 13 వేలకు భక్తులు దక్కించుకున్నారు. మిగిలిన నీటిని పేద దంపతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నీటితో స్నానంచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్ల వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు చెబుతారు. 2019లో జరిగిన వేలంలో బిందెడు నీటిని రూ.2.50 లక్షలకు కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని