పది వేల కార్లు, బైక్‌లకు ఓనర్‌!

సైకిళ్ల నుంచి విమానాల వరకు అన్నిరకాల డైకాస్ట్‌ మోడళ్ల సేకరణతో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు బిహార్‌కు చెందిన ఆసిఫ్‌ వసీ. పట్నాలోని అశోక్‌ రాజ్‌పథ్‌ ప్రాంతానికి చెందిన ఇతనికి మార్కెట్లోకి కొత్తగా వచ్చే బైక్‌లు, కార్లు అంటే ప్రత్యేక ఆసక్తి.

Published : 15 Apr 2022 06:53 IST

డైకాస్ట్‌ మోడళ్ల సేకరణలో పట్నా వాసి

పట్నా: సైకిళ్ల నుంచి విమానాల వరకు అన్నిరకాల డైకాస్ట్‌ మోడళ్ల సేకరణతో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు బిహార్‌కు చెందిన ఆసిఫ్‌ వసీ. పట్నాలోని అశోక్‌ రాజ్‌పథ్‌ ప్రాంతానికి చెందిన ఇతనికి మార్కెట్లోకి కొత్తగా వచ్చే బైక్‌లు, కార్లు అంటే ప్రత్యేక ఆసక్తి. ఎక్కడ కొత్తవి కనిపించినా.. వాటి డైకాస్ట్‌ మోడళ్లను సేకరిస్తుంటారు. 25 ఏళ్లుగా దాదాపు 10 వేలకుపైగా అలాంటి నమూనాలను పోగుచేశాడు. అతనివద్ద బజాజ్‌ స్కూటర్లు, లాంబ్రెట్టా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, బజాజ్‌ బైక్‌, కేటీఎం, హోండా, హీరో హోండా వంటి ద్విచక్ర వాహన మోడళ్లతో పాటు బీఎండబ్ల్యూ, ఆడి, లంబోర్గిని, హ్యుందాయ్‌, మారుతీ తదితర కార్ల నమూనాలు చాలానే ఉన్నాయి. పలు దేశాల ఎయిర్‌లైన్లకు చెందిన విమానాల మోడళ్లూ ఉన్నాయి.

* వాహనాల కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చే ముందు వాటికి సూక్ష్మ ప్రతిరూపాలుగా విడుదల చేసేవే ఈ డైకాస్ట్‌ మోడల్స్‌. ఇవి బొమ్మల్లా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని